Akbaruddin Owaisi: కోర్టు ఆదేశాలతో అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

  • గత నెల 23న కరీంనగర్ లో ఎంఐఎం సమావేశం
  • హాజరైన అక్బరుద్దీన్
  • విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఫిర్యాదు

ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూలై 23న కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ పట్టణ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఎంఐఎం నేత ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదంటూ పేర్కొనడంతో కాషాయదళం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.

Akbaruddin Owaisi
MIM
Karimnagar District
BJP
Police
  • Loading...

More Telugu News