Grama Volunteers: గ్రామ వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి: ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
- కాకినాడలో గ్రామ వాలంటీర్లకు మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ
- జన్మభూమి కమిటీలలా వాలంటీర్ వ్యవస్థ ఉండదు
- వాలంటీర్లు తప్పు చేస్తే వెంటనే తొలగిస్తాం
గ్రామ వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ జెడ్పీహాల్ లో గ్రామ వాలంటీర్లకు మాస్టర్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. జన్మభూమి కమిటీలలా కాకుండా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని, వారు తప్పు చేస్తే వెంటనే తొలగించి కొత్త వారిని నియమిస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల గురించి ఆయన ప్రస్తావించారు. వీటిని తొలగించలేదని, బడ్జెట్ లో కేటాయింపులపై పరిశీలిస్తున్నట్టు చెప్పారు.