Jagan: కావాలంటే జగన్ తన సొంత ఆస్తులు పంచుకోవాలి... గోదావరి మిగులు జలాలు ఏపీ సొత్తు: తులసిరెడ్డి

  • కేసీఆర్ చేతిలో జగన్ కీలుబొమ్మలా మారారంటూ విమర్శలు
  • రాష్ట్రాన్ని జగన్ ఎడారిలా మారుస్తున్నారంటూ ధ్వజమెత్తిన తులసిరెడ్డి
  • జగన్ స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడుతున్నారంటూ ఆగ్రహం

ఏపీ సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలా మారారని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. గోదావరి మిగులు జలాలపై కేసీఆర్ ప్రతిపాదనకు జగన్ అంగీకారం తెలపడం సబబు కాదని అన్నారు. కేసీఆర్ చెప్పినట్టల్లా ఆడుతూ జగన్ రాష్ట్రాన్ని ఎడారిలా మారుస్తున్నారని మండిపడ్డారు. గోదావరి మిగులు జలాలపై కేసీఆర్ ప్రతిపాదనకు జగన్ తలూపడం చారిత్రక తప్పిదమని పేర్కొన్నారు. కావాలంటే జగన్ తన సొంత ఆస్తులు పంచుకోవాలని, గోదావరి మిగులు జలాలు ఏపీ సొత్తు అని స్పష్టం చేశారు. సీఎం జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్ ను కేసీఆర్ చేతుల్లో పెడుతున్నారని మండిపడ్డారు.

Jagan
KCR
Tulasi Reddy
Congress
  • Loading...

More Telugu News