Devdas Kanakala: ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూత

  • అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • దేవదాస్ చివరగా నటించిన చిత్రం 'భరత్ అనే నేను'
  • 1945లో యానాంలో జన్మించిన దేవదాస్ కనకాల

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాల టాలీవుడ్ లో పేరున్న నటుడు కాగా, ఆయన కోడలు సుమ అగ్రశ్రేణి యాంకర్ గా పేరుతెచ్చుకున్నారు. 1945 యానాంలో జన్మించిన దేవదాస్ కనకాల నటుడిగానే కాకుండా, నటనా శిక్షకుడిగా సైతం ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన అర్ధాంగితో కలిసి యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ పెట్టి అనేకమందిని చిత్ర పరిశ్రమకు అందించారు. నటుడిగా సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన చివరగా నటించిన చిత్రం 'భరత్ అనే నేను'. ఆయన భార్య లక్ష్మి గతేడాది మరణించిన సంగతి విదితమే.

Devdas Kanakala
Tollywood
Suma
Rajv Kanakala
  • Loading...

More Telugu News