Nimmagadda Prasad: సెర్బియా నిర్బంధంలో ఉన్నారు... ఆయన రాలేరు: నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున సీబీఐ కోర్టులో మెమో

  • సెర్బియాలో నిమ్మగడ్డను అరెస్ట్ చేసిన పోలీసులు
  • తన క్లయింటు స్వదేశానికి రాలేకపోతున్నారంటూ కోర్టుకు విన్నవించిన న్యాయవాది
  • ఇదే విషయాన్ని సీబీఐకి కూడా తెలియజేసిన న్యాయవాది

మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా, సెర్బియా పోలీసుల నిర్బంధంలో ఉన్న కారణంగా తన క్లయింటు స్వదేశానికి రాలేకపోతున్నారని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఇదే విషయాన్ని సీబీఐ అధికారులకు కూడా తెలియజేశారు. ఇటీవలే నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా దేశానికి విహారయాత్ర నిమిత్తం వెళ్లగా, వాన్ పిక్ వ్యవహారంలో రస్ అల్ ఖైమా సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడి పోలీసులు నిమ్మగడ్డను అరెస్ట్ చేయడం తెలిసిందే.

Nimmagadda Prasad
CBI
Court
  • Loading...

More Telugu News