Vijay Sai Reddy: అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపులు కాలుస్తున్న పైశాచిక ఆనందం మీది: విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఫైర్

  • క్యాంటీన్ల నిర్మాణంలో దోచుకున్నారంటూ విజయసాయి ట్వీట్
  • ఘాటుగా బదులిచ్చిన బుద్ధా
  • అన్న క్యాంటీన్ల మూసివేతపై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు

గత ప్రభుత్వం నిర్మించిన అన్న క్యాంటీన్లను జగన్ సర్కారు మూసివేయడం పట్ల టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. తాజాగాను, ఒక్కో అన్న క్యాంటీన్ ను రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల ఖర్చుతో నిర్మించారని, పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ల నిర్మాణంలో కూడా దోచుకున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలను ఆగ్రహావేశాలకు లోనయ్యేలా చేశాయి. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు.

అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపులు కాలుస్తున్న పైశాచిక ఆనందం మీ మాటల్లో కనిపిస్తోందంటూ విజయసాయిరెడ్డికి కౌంటర్ వేశారు. నాలుగు రోజుల పాటు మతయాత్ర చేస్తున్న మీ అధినేత సెక్యూరిటీ కోసం రూ.22.52 లక్షల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు, నిత్యం వేల సంఖ్యలో పేదవాళ్లకు ఏళ్ల తరబడి సేవలు అందించే అన్న క్యాంటీన్ ను రూ.35 లక్షలతో నిర్మించకూడదా? అంటూ బుద్ధా వెంకన్న నిలదీశారు.

Vijay Sai Reddy
Buddha Venkanna
Telugudesam
YSRCP
Anna Canteen
  • Loading...

More Telugu News