Gas Cylender: సబ్సిడీ సిలిండర్ పై భారీగా తగ్గిన ధర!

  • 14.2 కిలోల సిలిండర్ పై రూ. 62.50 తగ్గింపు
  • రూ. 627.50కు చేరిన గ్యాస్ సిలిండర్ ధర
  • తగ్గిన ధర తక్షణమే అమలులోకి

సబ్సిడీ వంట గ్యాస్ ను వినియోగించే వారికి ఇది పెద్ద శుభవార్త. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 62.50 తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ప్రస్తుతం రూ.690గా ఉన్న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 627.50కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో నెలకొన్న అనిశ్చితి కారణంగా సహజవాయు ధరలు తగ్గడం, ఇదే సమయంలో రూపాయి మారకపు విలువ పెరిగిన నేపథ్యంలో ధరలను తగ్గిస్తూ నిర్ణయం వెలువడింది.

తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చినట్టని ఓఎంసీలు వెల్లడించాయి. కాగా, గత మూడు నెలల నుంచి వంట గ్యాస్ ధర తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. జూన్ లో రూ. 793గా ఉన్న ధర, జూలైలో రూ. 690కి తగ్గింది. ఆపై ఇప్పుడు మరింతగా దిగి వచ్చింది.

Gas Cylender
Price Cut
OMCs
  • Loading...

More Telugu News