Raghavendra rao: రెండేళ్ల క్రితమే విడిపోయిన రాఘవేంద్రరావు కుమారుడు, కోడలు

  • తమ వైవాహిక జీవితం గురించి వెల్లడించిన కనిక  
  • ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి
  • పరస్పర అంగీకారంతో విడిపోయాం

టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుటుంబానికి సంబంధించిన సంచలన వార్త వెలుగు చూసింది. ఆయన కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి, కోడలు కనిక దిల్లాన్ లు రెండేళ్ల క్రితమే విడిపోయారట. తాజాగా ఈ విషయాన్ని కనిక వెల్లడించింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'కు వీరిద్దరూ కలసి పని చేశారు. ఈ సినిమాకు ప్రకాశ్ దర్శకత్వం వహించగా, కనిక రచయిత్రిగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి కనిక వెల్లడించారు.

తామిద్దరం రెండేళ్ల క్రితమే విడిపోయామని కనిక తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పారు. రెండేళ్ల క్రితం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, స్నేహితుల్లా కలిసున్నామని తెలిపారు. ప్రకాశ్, కనికలు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పలు బాలీవుడ్ చిత్రాలకు ఇద్దరూ కలసి పని చేశారు.

Raghavendra rao
Son
Daughter in law
Prakash
Kanika
  • Loading...

More Telugu News