Guntur: గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మి.. ఇక సీబీఐ ఎస్పీ

  • సీబీఐ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు
  • కేంద్ర హోమ్ శాఖ నుంచి ఆదేశాలు
  • రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ కానున్న జయలక్ష్మి 

ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి, ప్రస్తుతం గుంటూరు గ్రామీణ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆర్‌ జయలక్ష్మి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు అటాచ్ కానున్నారు. ఆమెను సీబీఐ ఎస్పీగా నియమిస్తూ హోమ్ శాఖ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు రూరల్ ఎస్పీ బాధ్యతల నుంచి, రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే ప్రభుత్వం నుంచి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిప్యుటేషన్ పై సీబీఐలో పనిచేసేందుకు ఆమె న్యూఢిల్లీకి వెళ్లి రిపోర్ట్ చేయనున్నారని అధికారులు వెల్లడించారు.

Guntur
Rural SP
Jayalakshmi
CBI
Transfer
Deputation
  • Loading...

More Telugu News