Sujana Chowdary: నా రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబే కారణం.. ఆయనకు కృతజ్ఞుడిని: సుజనా చౌదరి

  • చంద్రబాబు ప్రయత్నంపై అసంతృప్తి ఉండేది
  • టీడీపీని చీల్చడం వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదు
  • రాష్ట్రానికి మోదీ అన్యాయం చేయలేదు

తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన చంద్రబాబుకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటానని బీజేపీ నేత సుజనా చౌదరి పేర్కొన్నారు. ఏపీలో రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదాల వల్లే టీడీపీ ఓడిపోయిందన్న ఆయన.. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడాన్ని తాను తొలి నుంచీ వ్యతిరేకించినట్టు చెప్పారు. చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డానని పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ప్రకటించిన చంద్రబాబు.. ఆ తర్వాత సరైన అంచనాలు వేయడంలో విఫలమయ్యారని అన్నారు.

ప్రత్యేక హోదాను బూచిగా చూపించి తప్పుకోవడం సరైనది కాదని పొలిట్ బ్యూరో సమావేశంలోనూ చెప్పానని గుర్తు చేశారు. పొత్తును నిలిపేందుకు అమిత్ షా చివరి వరకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో మోదీ ఎటువంటి అన్యాయం చేయలేదని తాను స్పష్టంగా చెప్పగలనన్నారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందుతున్న ఏకైక జాతీయ ప్రాజెక్టు పోలవరమేనని సుజనా పేర్కొన్నారు. ఏపీలో టీడీపీని చీల్చడం వల్ల బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని అయితే, బీజేపీలో చేరాలనుకునే వారిని మాత్రం ఆహ్వానిస్తామని సుజనా చెప్పుకొచ్చారు.

Sujana Chowdary
BJP
Chandrababu
Narendra Modi
  • Loading...

More Telugu News