Telugudesam: బీజేపీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డి, పసుపులేటి సుధాకర్

  • బీజేపీలో చేరిన టీడీపీ నేత గంగుల, జనసేన నేత పసుపులేటి సుధాకర్
  • పార్టీలోకి ఆహ్వానించిన మురళీధరరావు, కన్నా
  • వైసీపీకి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతామన్న నేతలు 

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన టీడీపీ సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి, జనసేన నేత పసుపులేటి సుధాకర్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయకండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గంగుల, పసుపులేటిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు.అనంతరం మురళీధరరావు మాట్లాడుతూ, ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీజేపీ ఎదుగుతుందని అన్నారు. దక్షిణాదిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.

Telugudesam
Gangula pratap reddy
Jansena
pasupuleti
Bjp
Muralidhar Rao
Kanna
Lakshmi Narayana
  • Loading...

More Telugu News