Indonesia: పెళ్లికి ముందే శారీరకంగా కలిసిన జంటకు వీపు విమానం మోత మోగించారు!

- ఇండోనేషియాలో షరియా చట్టం
- ప్రేమికులకు వీపు చిట్లిపోయేలా బెత్తం దెబ్బలు
- కాళ్లావేళ్లాపడినా కనికరించిన షరియా పెద్దలు
ముస్లిం ప్రాబల్య దేశాల్లో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయి. తాజాగా, ఇండోనేషియాలో ఓ యువజంట పెళ్లికి ముందే శారీరకంగా కలవడంతో వారికి షరియా చట్టాల ప్రకారం శిక్ష విధించారు. ఒక్కొక్కరి వీపుపై 100 బెత్తం దెబ్బలు కొట్టారు. ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్ కు చెందిన ఆ ప్రేమికుల జంట పెళ్లి కాకముందే శారీరకంగా ఒక్కటవుతూ దొరికిపోయారు. దాంతో షరియా అధికారులు ఆ ప్రేమికులను అందరిముందు నిలబెట్టి బడితె పూజ చేశారు.
