Indonesia: పెళ్లికి ముందే శారీరకంగా కలిసిన జంటకు వీపు విమానం మోత మోగించారు!

  • ఇండోనేషియాలో షరియా చట్టం
  • ప్రేమికులకు వీపు చిట్లిపోయేలా బెత్తం దెబ్బలు
  • కాళ్లావేళ్లాపడినా కనికరించిన షరియా పెద్దలు

ముస్లిం ప్రాబల్య దేశాల్లో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయి. తాజాగా, ఇండోనేషియాలో ఓ యువజంట పెళ్లికి ముందే శారీరకంగా కలవడంతో వారికి షరియా చట్టాల ప్రకారం శిక్ష విధించారు. ఒక్కొక్కరి వీపుపై 100 బెత్తం దెబ్బలు కొట్టారు. ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్ కు చెందిన ఆ ప్రేమికుల జంట పెళ్లి కాకముందే శారీరకంగా ఒక్కటవుతూ దొరికిపోయారు. దాంతో షరియా అధికారులు ఆ ప్రేమికులను అందరిముందు నిలబెట్టి బడితె పూజ చేశారు.
ఆ యువతి దెబ్బలకు తట్టుకోలేక విడిచిపెట్టమని ప్రాధేయపడినా, మధ్యమధ్యలో వైద్యపరీక్షలు చేస్తూ 100 దెబ్బలు పూర్తిచేశారు. ఆమె ప్రియుడికి కూడా అదే రీతిలో వీపు చిట్లిపోయేలా కొట్టారు. ఇండోనేషియాలో యువతీయువకులు పెళ్లికాకుండా ఒకరిని మరొకరు తాకడం కూడా నేరం. ఓ యువతి, యువకుడు కొన్నినెలల కిందట చేతిలో చెయ్యేసి నడిచారంటూ ఇదే రీతిలో బెత్తం ఝుళిపించారు.

  • Loading...

More Telugu News