Amazon: 'ఫ్రీడం సేల్' తో మరోసారి అమెజాన్ జాతర

  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెజాన్ బంపర్ ఆఫర్లు
  • ఈ నెల 8 నుంచి 11వరకు ఫ్రీడం సేల్  
  • ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ తగ్గింపు ధరలు

ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారులను ఊరిస్తోంది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడం సేల్ పేరుతో ఆగస్టు 8 నుంచి 11వ తేదీ వరకు భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీగా రాయితీలు ఇస్తోంది. మొబైల్ ఫోన్లు, వాటి ఉపకరణాలపై 40 శాతం, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ వాచ్ లు, కెమెరాలపై 50 శాతం డిస్కౌంట్ లభించనుంది. కాగా, ఎస్ బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు రాయితీ ఇస్తున్నట్టు అమెజాన్ పేర్కొంది.

Amazon
Freedom Sale
Offers
Discount
SBI
  • Loading...

More Telugu News