Sri Lanka: స్టేడియంలో బైక్ నడుపుతూ కిందపడిన శ్రీలంక క్రికెటర్

  • బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ నెగ్గిన శ్రీలంక
  • చివరి మ్యాచ్ లో గెలుపు అనంతరం ఆటగాళ్ల సంబరాలు
  • స్వల్పగాయాలపాలైన మెండిస్

వరల్డ్ కప్ లో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చిన శ్రీలంక జట్టు సొంతగడ్డపై రెచ్చిపోయింది. బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-0తో స్వీప్ చేసింది. అయితే, చివరి వన్డే ముగిసిన తర్వాత మైదానంలో సంబరాలు చేసుకుంటున్న తరుణంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. సిరీస్ బహుమతుల ప్రదానోత్సవంలో లంక ఆటగాళ్లకు రెండు స్పోర్ట్స్ బైకులు ఇచ్చారు. వాటిలో ఒకదానిపై లంక విధ్వంసక ఆటగాడు కుశాల్ మెండిస్, మరో ఆటగాడు ఎక్కారు. మైదానంలో జోరుగా బండి నడిపిన మెండిస్ వేగంగా మలుపుతిప్పబోయి కిందడిపోయాడు. వెనుక కూర్చున్న ఆటగాడు తప్పించుకోగా, మెండిస్ మాత్రం బండి కింద చిక్కుకుపోయాడు. వెంటనే ఇతర ఆటగాళ్లు, సిబ్బంది అక్కడికి చేరుకుని మెండిస్ ను పైకి లేపారు. ఈ ఘటనలో మెండిస్ కు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.

Sri Lanka
Cricket
Bike
  • Error fetching data: Network response was not ok

More Telugu News