Kul Bhushan Jadav: కులభూషణ్ జాదవ్ ను కలిసేందుకు భారత అధికారులకు అనుమతి

  • గూఢచర్యం ఆరోపణతో పాక్ జైల్లో ఉన్న కుల్ భూషణ్ జాదవ్
  • మరణశిక్ష విధించిన పాక్
  • శిక్షను పునఃసమీక్షించాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు

గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ జైల్లో మగ్గిపోతున్న నేవీ రిటైర్డ్ ఆఫీసర్ కులభూషణ్ జాదవ్ ను కలిసేందుకు భారత అధికారులకు అనుమతి లభించింది. తమ భూభాగంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కుల్ భూషణ్ ను పాకిస్థాన్ బలగాలు 2017లో అదుపులోకి తీసుకున్నాయి. విచారణ అనంతరం మరణశిక్ష విధించారు. దాంతో ఈ వ్యవహారాన్ని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా, ఇటీవలే విచారణ జరిపిన న్యాయస్థానం కుల్ భూషణ్ కు విధించిన మరణశిక్షను మరోసారి సమీక్షించాలంటూ పాక్ ను ఆదేశించింది.

ఈ తీర్పు నేపథ్యంలో కుల్ భూషణ్ ను కలిసేందుకు భారత్ కు మార్గం సుగమమైంది. పాక్ జైల్లో ఉన్న కుల్ భూషణ్ ను రేపు భారత దౌత్య అధికారులు కలవనున్నారు. కుల్ భూషణ్ కు న్యాయసహాయం అందించే అంశాలపై అధికారులు మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

Kul Bhushan Jadav
India
Pakistan
  • Loading...

More Telugu News