Yadadri Bhuvanagiri: కొండాపురంలో జింక వేట...విందులో పాల్గొన్న పలువురు రాజకీయనేతలు!

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన 
  • మూడు రోజుల క్రితం జింక వేట
  • అటవీ సిబ్బందికి సమాచారమిచ్చిన కొందరు గ్రామస్తులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో వన్యప్రాణి జింకను వేటాడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం మోత్కూర్ మండలంలోని కొండాపురం అటవీ ప్రాంతంలో జింకను వేటాడిన ఘటన జరిగింది. అనంతరం చేసుకున్న విందులో పలువురు రాజకీయనేతలు పాల్గొన్నట్టు సమాచారం. విందు చేసుకున్న ప్రాంతంలో జింక ఎముకలను గుర్తించిన కొందరు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.   

Yadadri Bhuvanagiri
Kondapur
Deer
Hunting
  • Loading...

More Telugu News