Jagan: దుర్యోధనుడిలాంటి జగన్ కి తోడుగా శకుని మామ విజయసాయిరెడ్డి ఉన్నారు: బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు

  • ఆంధ్రాలో అవినీతి తప్ప అభివృద్ధి అనేది పగటి కలే 
  •  హస్తినలో పాదపూజలకు అలవాటు పడ్డారు 
  •  విజయసాయిరెడ్డి ‘ఏ2’ ఇమేజ్ కి ఎటువంటి ఢోకా లేదు

ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోమారు విరుచుకుపడ్డారు. దుర్యోధనుడితో జగన్ ని, శకునితో విజయసాయిరెడ్డిని పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దుర్యోధనుడిలాంటి జగన్ కి తోడుగా శకుని మామ ఉండగా ఆంధ్రాలో అవినీతి తప్ప అభివృద్ధి అనేది పగటి కలే అంటూ ఓ ట్వీట్ చేశారు. హస్తినలో పాదపూజలకు అలవాటు పడ్డ విజయసాయిరెడ్డి, ఇంతకంటే ఏం మాట్లాడతారు? అని ప్రశ్నించారు. మరోసారి శ్రీకృష్ణజన్మస్థానం ప్రాప్తిస్తే అంతా సర్దుకుంటుందని, విజయసాయిరెడ్డి ‘ఏ2’ ఇమేజ్ కి ఎటువంటి ఢోకా లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Jagan
YSRCP
mp
Vijayasai reddy
Buddha
  • Error fetching data: Network response was not ok

More Telugu News