karthikeya: తెలుగు సినిమాలపై ఆసక్తి పెరిగింది: హీరోయిన్ 'అనఘ'
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-0105cbd34a9e44202c17391033842a1bc6775437.jpg)
- రేపు విడుదలవుతోన్న 'గుణ 369'
- కథానాయికగా 'అనఘ' పరిచయం
- తన పాత్ర నచ్చుతుందన్న అనఘ
తెలుగు తెరపై గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మలయాళీ ముద్దుగుమ్మలు ఎక్కువగా నిలదొక్కుకుంటున్నారు. అగ్రహీరోల సరసన అవకాశాలను అందుకుంటూ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో మలయాళం నుంచి మరో సుందరి తెలుగు తెరను పలకరించింది .. ఆమె పేరే 'అనఘ'.
మలయాళంలో మూడు సినిమాలు .. తమిళంలో ఒక సినిమా చేసిన ఈ అమ్మాయి. 'గుణ 369' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమవుతోంది. రేపు విడుదలవుతోన్న ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందనీ, ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. తెలుగు చిత్రపరిశ్రమలో కథానాయికలకు దక్కుతోన్న ఆదరణ చూసి తాను ఆశ్చర్యపోయాననీ, అప్పటి నుంచి ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనే ఆసక్తి పెరిగిపోయిందని అంది. అనఘ తన అందంతో .. అభినయంతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.