Vijayawada: విజయవాడలో ఒంటరి యువతిని వేధించిన ఆకతాయిలు... తరిమికొట్టిన వైనం!

  • సిటీ బస్టాండ్ వద్ద ఘటన
  • వేధింపులపై ఎదురుతిరిగిన యువతి
  • సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్న పోలీసులు

అర్ధరాత్రి పూట తనను అటకాయించి వేధిస్తున్న ఆకతాయిలు పారిపోయేలా చేసిందో యువతి. ఈ ఘటన నిన్న రాత్రి విజయవాడ సిటీ బస్టాండ్ టెర్నినల్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, నగరానికి చెందిన ఓ యువతి బస్ కోసం వేచి చూస్తున్న సమయంలో, ఆమె ఒంటరిగా ఉండటాన్ని చూసిన కొంతమంది ఆకతాయిలు అసభ్య ప్రవర్తనకు దిగి, వేధించారు. వెంటనే ఆ యువతి వారికి ఎదురుతిరిగి, పెద్దగా కేకలు వేస్తూ, వారితో తలపడింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడకు వస్తుండటంతో, దాన్ని గమనించిన ఆకతాయిలు పరుగు లంఘించుకున్నారు. విషయం తెలుసుకున్న కృష్ణలంక పోలీసులు, బస్టాండ్ సమీపంలో ఉన్న అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ లనూ పరిశీలిస్తున్నారు. ఆకతాయిలు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని ఓ అధికారి వెల్లడించారు.

Vijayawada
City busstand
Lady
Police
Harrasment
  • Loading...

More Telugu News