kalyan Ram: సంపత్ నందితో కల్యాణ్ రామ్

  • మాస్ కథలతో అలరించే సంపత్ నంది
  • కల్యాణ్ రామ్ కోసం విభిన్నమైన కథ
  • త్వరలోనే పూర్తి వివరాల ప్రకటన  

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో సంపత్ నంది ఒకరుగా కనిపిస్తాడు. ప్రస్తుతం ఆయన కల్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మాస్ యాక్షన్ తో పాటు కామెడీకి ప్రాధాన్యతనిస్తూ సంపత్ నంది ఈ కథపై కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు.

'పటాస్' తరువాత కల్యాణ్ రామ్ ఆ స్థాయి యాక్షన్ కామెడీ సినిమాలు చేయలేదు. అందువలన ఆయన సంపత్ నందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడట. ఆయన పాత్రలో వివిధ కోణాలు ఉంటాయట. ఇలా ఆయన పాత్రలోని వేరియేషన్స్ నుంచే కామెడీ పుడుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో ప్రకటన చేయనున్నారు.

kalyan Ram
sampath Nandi
  • Loading...

More Telugu News