Bellamkonda Srinivas: ఆసక్తిని పెంచుతోన్న 'రాక్షసుడు'

  • థ్రిల్లర్ మూవీగా 'రాక్షసుడు'
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 
  • రేపు భారీ విడుదల  

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'రాక్షసుడు' తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. 2 గంటల 29 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా రేపు విడుదలకి సిద్ధమైంది.

టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి .. హత్య చేసే ఒక సైకో కిల్లర్ కథ ఇది. తమిళంలో కొంతకాలం క్రితం హిట్ కొట్టిన 'రాచ్చసన్' కి ఇది రీమేక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా అనుపమా పరమేశ్వరన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ అందరిలో ఆసక్తిని పెంచేశాయి. జిబ్రాన్ సంగీతం .. రీ రికార్డింగ్ ఈ థ్రిల్లర్ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.

Bellamkonda Srinivas
Anupama Parameshvaran
  • Loading...

More Telugu News