Bonda Uma: టీడీపీకి బోండా ఉమ గుడ్‌బై.. త్వరలోనే వైసీపీలోకి?

  • తూర్పు బాధ్యతలు అప్పగిస్తామని ప్రతిపాదన
  • సుముఖంగా లేని బోండా
  • ఆస్ట్రేలియా నుంచి వచ్చాక నిర్ణయం

టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారా? ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది. త్వరలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉండడంతో పార్టీలోకి వస్తే తూర్పు బాధ్యతలను అప్పగిస్తామని బోండా వద్ద వైసీపీ ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తోంది.

వైసీపీ ప్రతిపాదనకు బోండా అంత ఆసక్తి కనబరచలేదని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పనిచేసిన బొప్పన భవకుమార్, ఎన్నికలకు ముందు ఇదే నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన యలమంచిలి రవి తదితరులు సీనియర్లు కావడంతో తనకు వారి నుంచి సహకారం ఉండకపోవచ్చని బోండా ఉమ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోండా ఉమ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఐదో తేదీన ఆయన తిరిగి విజయవాడ రానున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరిక విషయమై నిర్ణయం తీసుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు.

Bonda Uma
Andhra Pradesh
Telugudesam
YSRCP
Vijayawada
  • Loading...

More Telugu News