Kanaka Durga: వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ దుర్గమ్మకు పుట్టిల్లులాంటిది: సీపీ ద్వారకా తిరుమలరావు

  • అమ్మవారికి సారె సమర్పించడం అదృష్టం
  • తొలిసారి ఆషాఢ సారె సమర్పిస్తున్నాం
  • పోలీస్ కుటుంబీకులంతా పాల్గొనడం గొప్ప అనుభూతి

వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ బెజవాడ కనకదుర్గమ్మకు పుట్టిల్లులాంటిదని, అలాంటి అమ్మవారికి సారె సమర్పించడం తమ అదృష్టమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించారు. నేడు సీపీ దంపతులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి దుర్గమ్మ నామస్మరణతో వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, తొలిసారి పోలీస్ డిపార్ట్‌మెంట్ తరుపున అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నామన్నారు. పోలీస్ కుటుంబీకులంతా అమ్మవారి సారె సమర్పణలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని సీపీ ద్వారకా సీపీ పేర్కొన్నారు. 

Kanaka Durga
Dwaraka Tirumalarao
Police Station
Vijayawada
Police Department
  • Loading...

More Telugu News