నాకు మీసాలొచ్చిన తర్వాత ఎవరినీ, ఏదీ అడుక్కోలేదు: పోసాని కృష్ణమురళి
- వైసీపీ తరపున నాకు ఏ పదవి కావాలని అడిగారు
- నాకు ఏ పదవీ వద్దన్నాను
- జగన్ సీఎం అయితే చాలని చెప్పాను
‘నాకు మీసాలు వచ్చిన తర్వాత నాకై నేను ఎప్పుడూ, ఎవరినీ, ఏదీ ఇంత వరకూ అడుక్కోలేదు. సినిమా ఇండస్ట్రీలో గానీ, ఉద్యోగం విషయంలో గానీ, మరోచోట గానీ నేను ఎవ్వరినీ బెగ్గింగ్ చేసిందే లేదు. ‘ఎవరైనా ఈ పని నువ్వు చేస్తే బాగుంటుంది మురళి. ఇది నువ్వు చేసి పెట్టవా, ఇది నువ్వు చెయ్యవా’ అని అడిగితే తాను తప్పకుండా చేస్తానని అన్నారు. అంతేగానీ, ఎగబడి ఫలానా పని తాను చేస్తానని అడగడం, సిఫారసులు చేయించుకోవడం తనకు చేతగాదని స్పష్టం చేశారు. నిజాయతీగా ఫలానా పని తాను చేయగలనని నమ్మి అప్పగించే పనులను, ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే పనులను అప్పగిస్తే చేయగలనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.