TRS: అందుకే, నేను బీజేపీలో చేరింది: బాబూమోహన్

  • సింగూరు నీటి తరలింపునకు అడ్డు జెప్పా
  • అందుకే, టీఆర్ఎస్ నాకు టికెట్ ఇవ్వలేదు
  • ఎన్టీఆర్ కు ఇష్టమైన బీజేపీలో చేరాను

టీఆర్ఎస్ కేవలం మాటల ప్రభుత్వమే కానీ, చేతల ప్రభుత్వం కాదని బీజేపీ నేత, సినీ హాస్యనటుడు బాబూమోహన్ విమర్శలు చేశారు. సంగారెడ్డిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్లోని మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్నారని, అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. సింగూరు నీటి తరలింపునకు అడ్డు జెప్పినందుకే మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. తాను ఎన్టీఆర్ అభిమానినని, అందుకే, ఆయనకు ఇష్టమైన బీజేపీలో చేరానని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయన అభిప్రాయపడ్డారు.

TRS
Kcr
Singur
Mission Kakatiya
Babu mohan
  • Loading...

More Telugu News