Sidharth: సిద్ధార్థ రాసిన లేఖపై విచారణ జరిపిస్తామంటున్న కాఫీ డే బోర్డు!

  • లావాదేవీల గురించి బోర్డుకు తెలియదంటూ లేఖ
  • లేఖపై విచారణ నిర్వహించనున్నట్టు పేర్కొన్న బోర్డు
  • బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్‌వీ రంగనాథ్‌

కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ మృతితో పాటు ఆయన రాసినట్టు వెలుగులోకి వచ్చిన లేఖపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డు, ఆడిటర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్‌కు తాను నిర్వహించిన లావాదేవీల గురించి తెలియదని సిద్ధార్థ ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే ఈ లేఖపై విచారణ నిర్వహించనున్నట్టు ఆ కంపెనీ బోర్డు వెల్లడించింది. సిద్ధార్థ మరణానంతరం పలు కీలక నిర్ణయాలను బోర్డు తీసుకుంది. బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్‌వీ రంగనాథ్‌ను నియమించింది. అలాగే తాజా పరిణామాలపై న్యాయ సలహా కోసం సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్‌ సంస్థను బోర్డు నియమించింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నితిన్‌ బాగ్మనేను నియమించింది.

Sidharth
Cafe Coffee Day
Letter
Board
SV Ranganath
Siril Amarchand
  • Loading...

More Telugu News