B Pharamacy: కిడ్నాపర్ రవిశంకర్ పై మరో కిడ్నాప్ ఆరోపణ!

  • మీడియాలో చూసి రవిశంకర్‌ను గుర్తు పట్టిన నాగరాజు
  • రవిశంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు
  • అద్దంకి తీసుకెళ్లి ఉంటాడని అనుమానం

హయత్ నగర్ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసు నిందితుడు రవిశంకర్ ఫోటోలు మీడియాలో రావడంతో అతడిని గుర్తు పట్టిన హైదరాబాద్, జీడిమెట్లకు చెందిన నాగరాజు అనే వ్యక్తి తన కుమార్తెను కూడా అతనే కిడ్నాప్ చేశాడంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన కుమార్తె ఊహాశ్రీని రవిశంకరే కిడ్నాప్ చేశాడంటూ నాగరాజు ఆరోపిస్తున్నాడు. ఆమెను రవిశంకర్ అద్దంకికి తీసుకెళ్లి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. హయత్‌నగర్‌లో సోనీని కిడ్నాప్ చేసిన రవిశంకర్ దాదాపు వారం రోజుల తరువాత ఆమెను అద్దంకి బస్టాండ్‌లో వదిలి వెళ్లాడు. ఈ కేసు విచారణ పూర్తవకముందే ఊహాశ్రీ కేసు నమోదు కావడం గమనార్హం.

B Pharamacy
Ravishankar
Media
Nagaraju
Oohasri
Addanki
Sony
  • Loading...

More Telugu News