KTR: ప్రతిపక్షాలకు సమస్యలేమీ దొరక్క ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు: కేటీఆర్

  • గతంలో సవాళ్ల మీద సవాళ్లు విసిరారు
  • కొందరైతే గడ్డం తియ్యబోమని శపథం చేశారు
  • ఎన్నికల ద్వారానే సరైన సమాధానం చెబుతాం

ప్రతిపక్షాలకు గగ్గోలు పెట్టేందుకు రాష్ట్రంలో సమస్యలేమీ దొరక్కపోవడంతో ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నేడు ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. గతంలో కూడా కాంగ్రెస్ వాళ్లు సవాళ్ల మీద సవాళ్లు విసిరారని, కొందరైతే గడ్డాలు తియ్యబోమని శపథాలు చేశారని, కానీ చివరకు ఏం జరిగిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

ఎన్నికల ద్వారానే కాంగ్రెస్‌కు సరైన సమాధానం చెబుతామని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదుపై మాట్లాడుతూ, పార్టీ నిర్మాణంతోపాటు, కార్యకర్తలకు శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. గత నెల 27 నుంచి ఇప్పటి వరకూ 50 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారందరికీ బీమా అందేలా చూస్తామని, ఇందులో భాగంగా యునైటెడ్ ఇండియా కంపెనీకి రూ.11.21 కోట్ల చెక్కును అందజేశామన్నారు.

  • Loading...

More Telugu News