Junior Artist: జూనియర్ ఆర్టిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు.. రిమాండ్ కు తరలించిన పోలీసులు
- 25వ తేదీన బాధితురాలితో గొడవపడ్డ దిలీప్
- చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన వైనం
- ఊర్లో ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు
జూనియర్ ఆర్టిస్టును వేధిస్తూ, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన గుర్రం దిలీప్ అనే యువకుడు సినిమా షూటింగుల్లో పని చేస్తుంటాడు. జూనియర్ ఆర్టిస్ట్ అయిన బాధితురాలిది కూడా అదే గ్రామం. ఊర్లో ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. హైదరాబాదులోని ఇందిరానగర్ లో బాధితురాలు ఉంటోంది. ఈనెల 25న ఆమెతో దిలీప్ గొడవకు దిగాడు. అంతేకాదు, చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో, బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు... దిలీప్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.