Cafe Coffee Day: మంగళూరు వెన్ లాక్ ఆసుపత్రికి సిద్ధార్థ్ మృతదేహం!

  • నేత్రావతి బ్యాక్ వాటర్ లో మృతదేహం లభ్యం
  • పోస్టుమార్టం నిమిత్తం తరలింపు
  • తరలివస్తున్న బంధుమిత్రులు

ఈ ఉదయం నేత్రావతి బ్యాక్ వాటర్ లో లభ్యమైన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మంగళూరులోని వెన్ లాక్ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

ఇక సిద్ధార్థ మృతదేహం లభ్యమయిందని తెలిసిన వెంటనే ఆయన బంధుమిత్రులు వెన్ లాక్ ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్నటివరకూ తమ మధ్య తిరిగిన వ్యక్తి, ఇప్పుడు లేడంటే నమ్మలేకున్నామని అంటున్నారు. మరోవైపు మంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఉన్న కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లు, ఔట్ లెట్ల ఉద్యోగులు సిద్ధార్థ్ కు నివాళులు అర్పిస్తున్నారు.

Cafe Coffee Day
Sidharth
Died
Sucide
Netravati
Mangalore
  • Loading...

More Telugu News