Gajendra: వ్యాపారి గజేంద్ర కిడ్నాప్ కేసులో స్నేహితుడే సూత్రధారి: సీపీ అంజనీకుమార్
- రూ.3 కోట్లు డిమాండ్ చేసి కోటి వసూలు చేశారు
- గజేంద్రను అబిడ్స్‌లో వదిలి పెట్టారు
- ఆసుపత్రిలో చేరిన అనంతరం పోలీసులకు సమాచారం
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన వ్యాపారి గజేంద్ర కిడ్నాప్ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. దోమలగూడలోని ఏవీ కాలేజ్ వద్ద ఆదివారం రాత్రి గజేంద్ర కిడ్నాప్ జరిగిందని సీపీ తెలిపారు. గజేంద్ర కిడ్నాప్‌నకు స్నేహితుడే సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. గజేంద్రను అపహరించి రూ.3 కోట్లు డిమాండ్ చేసి, కోటి రూపాయలు వసూలు చేశారని పేర్కొన్నారు.
అనంతరం గజేంద్రను అబిడ్స్‌లో విడిచి పెట్టారన్నారు. గాయాలపాలైన గజేంద్ర ఆసుపత్రికి వెళ్లిన అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. టాస్క్‌ఫోర్స్, సాంకేతిక నిపుణుల బృందం సమన్వయంతో పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.35.30 లక్షల నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.