Narendra Modi: ఒక చారిత్రక తప్పిదాన్ని పార్లమెంటు సరిచేసింది: ట్రిపుల్ తలాక్ బిల్లుపై మోదీ వ్యాఖ్యలు

  • మధ్యయుగాల మూఢాచారం చెత్తబుట్టలో చేరిందంటూ వ్యాఖ్యలు
  • బిల్లు ఆమోదానికి సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని
  • భారత్ ఉప్పొంగిపోతోందంటూ ట్వీట్

ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ముస్లిం మహిళల పట్ల ఓ చారిత్రక తప్పిదాన్ని పార్లమెంటు సరిచేసిందని వ్యాఖ్యానించారు. మధ్యయుగాల నాటి మూఢాచారం చివరికి చరిత్ర చెత్తబుట్టలోకి చేరిందని ట్వీట్ చేశారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా ఇది గొప్ప విజయం అని మోదీ అభివర్ణించారు. భారత్ ఉప్పొంగిపోయే సుదినం అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు సహకరించిన పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Narendra Modi
Triple Talaaq
  • Loading...

More Telugu News