Rajya Sabha: ట్రిపుల్ తలాఖ్ రద్దు బిల్లుపై రాజ్యసభలో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ

  • సభ్యులకు స్లిప్పులు పంపిణీ
  • ఓటింగ్ కు దూరంగా టీడీపీ, టీఆర్ఎస్
  • బిల్లుకు తాము వ్యతిరేకమన్న వైసీపీ, కాంగ్రెస్

ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ట్రిపుల్ తలాఖ్ రద్దు బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశాల మేరకు సభలో ఉన్న సభ్యులకు స్లిప్పులు పంపిణీ చేశారు. ఓటింగ్ ప్రక్రియ స్లిప్పుల ద్వారా జరగనుంది. కాగా, రాజ్యసభలో సభ్యుల సంఖ్య 245 కాగా, బిల్లు ఆమోదానికి 121 ఓట్లు కావాల్సి ఉంది. బిల్లుకు తాము వ్యతిరేకమని కాంగ్రెస్, ఆర్జేడీ, వైసీపీ, టీఎంసీ, బీఎస్పీ, ఆప్, వామపక్షాలు ఇప్పటికే ప్రకటించగా, ఓటింగ్ కు దూరంగా ఉండాలని టీడీపీ, టీఆర్ఎస్, జేడీయూ పార్టీలు నిర్ణయించుకున్నాయి. అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దాంతో, అందుబాటులో ఉన్న సభ్యులతోనే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, ఈ బిల్లును సెలెక్ట్ ప్యానెల్ కు పంపాలన్న డిమాండ్ సభలో తిరస్కరణకు గురైంది.

  • Loading...

More Telugu News