Congress: తలాక్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడి రాజీనామా

  • దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంజయ్
  • ట్రిపుల్ తలాక్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
  • బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంజయ్

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ దశాబ్దాలుగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అలాంటి నేత అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. రేపు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్టు సంజయ్ సింగ్ ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది సంజయ్‌కు నచ్చకపోవడంతో ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం.

Congress
Triple Talaq
Rajyasabha
Uttar Pradesh
Sanjay Singh
Amith Shah
  • Loading...

More Telugu News