Telangana: పోర్టును ఎవరైనా అప్పగిస్తారా?... అసలు ఇంగితజ్ఞానం ఉందా?: విజయసాయి రెడ్డి

  • తెలంగాణకు బందరు పోర్టంటూ వార్తలు
  • విమర్శలకు దిగిన టీడీపీ నేతలు
  • ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చిన ఎంపీ

బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తారంటూ, ఓ వర్గం మీడియాలో వార్తలు రాగా, తెలుగుదేశం పార్టీ విమర్శలకు దిగిన నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, తన ట్విట్టర్ ఖాతాలో కౌంటర్ ఇచ్చారు. పోర్టును మరో రాష్ట్రానికి అప్పగించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

"మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ణానం ఉన్నవారికి ఎవరికీ అర్థం కాదు. ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చిందీ తమరే. హరికృష్ణ శవం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది మీరే కదా చంద్రబాబు గారూ. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించకండి" అని అన్నారు.

 అంతకుముందు "మీ రాక్షస పాలనలో ఉద్యోగులకు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారు చంద్రబాబు గారూ? అంగన్ వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరచిపోయారా? అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గూండాల్లా దాడిచేసిన మీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడింది" అని విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News