Ravishekar: ఒంగోలు సమీపంలో సోనీ కిడ్నాపర్ రవిశేఖర్ అరెస్ట్!

  • అద్దంకిలో సోనీని వదిలి ఒంగోలు వైపు రవిశేఖర్
  • గుర్తించి అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలింపు
  • హయత్ నగర్ పోలీసుల అదుపులో రవిశేఖర్

వారం రోజుల హైడ్రామాకు తెరపడింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ యువతి సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రవిశేఖర్ ను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకిలో సోనీని కిడ్నాపర్ విడిచిపెట్టగా, ఆమె హైదరాబాద్ చేరుకుని హయత్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే, ఆ సమాచారాన్ని ప్రకాశం జిల్లా పోలీసులకు చేరవేశారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం కాగా, ఒంగోలు శివార్లలో రవిశేఖర్ ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం రవిశేఖర్ హయత్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Ravishekar
Sony
Kidnap
Police
Arrest
  • Loading...

More Telugu News