PVP: జర ఓపిక పట్టు తమ్మీ..: పీవీపీ

  • విమర్శించే వారు ఓపికతో ఉండాలి
  • సీఎస్ఆర్ కింద వచ్చి సేవ చేస్తున్న టాటాలు
  • నేనే తెచ్చానని డబ్బాలు ఏంటప్పా?
  • ట్విట్టర్ లో పీవీపీ విమర్శలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న వారు కాస్తంత ఓపికతో ఉండాలని విజయవాడ లోక్ సభ స్థానానికి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన పారిశ్రామికవేత్త పీవీపీ అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను ఉంచారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగానే టాటా సంస్థ ఏపీకి వచ్చి సేవ చేస్తోందని అన్నారు. "అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు  టాటాను నేనే తెచ్చా అని డబ్బా ఏంటప్ప. సీఎస్ఆర్ కింద అన్ని కంపెనీలు చేయవలసిన సామాజిక సేవ అది. ఆరోగ్యశ్రీ అనే సంచలనం మన దేశంలో జరిగింది. కొన ఊపిరితో ఉన్న వైద్య వ్యవస్థకు సంజీవని ఇచ్చి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురాబోతున్నారు వైఎస్ జగన్. జర ఓపిక పట్టు తమ్మీ" అని వ్యాఖ్యానించారు.

PVP
Twitter
Telugudesam
Arogyasri
  • Error fetching data: Network response was not ok

More Telugu News