Kerala: బీడీ కొనివ్వలేదని ఎస్కార్ట్ పోలీసుపై ఖైదీ దాడి

  • కేరళలోని త్రిసూరు జిల్లాలో ఘటన
  • ఖైదీ దాడిలో గాయపడిన కానిస్టేబుల్
  • పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీని పట్టుకున్న స్థానికులు

తాగేందుకు బీడీ కొనివ్వలేదని ఓ పోలీసు అధికారిపై ఖైదీ దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు అప్రమత్తంగా వ్యవహరించి అతడిని పట్టుకుని తిరిగి పోలీసులకు అప్పగించారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. తిరువనంతపురం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రామచంద్రన్ అనే ఖైదీని చల్లకుడి కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

బీడీ కొనుక్కునేందుకు రామచంద్రన్ ప్రయత్నించగా ఎస్కార్ట్‌గా ఉన్న ప్రబీన్ అనే కానిస్టేబుల్ అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఖైదీ.. ప్రబీన్‌పై దాడి చేశాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారు పట్టుకుని అప్పగించారు. ఖైదీ దాడిలో గాయపడిన ప్రబీన్‌ను ఆసుపత్రికి, రామచంద్రన్‌ను పూజాపుర జైలుకు తరలించారు.

Kerala
thrissur
prisoner
constable
  • Loading...

More Telugu News