Sony: అద్దంకి వద్ద సోనీని వదిలేసి పారిపోయిన కిడ్నాపర్ రవిశేఖర్

  • వారం రోజుల క్రితం కిడ్నాప్
  • హైదరాబాద్ చేరుకున్న సోనీ
  • ప్రస్తుతం సోనీని ప్రశ్నిస్తున్న పోలీసులు

వారం రోజుల క్రితం హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ వద్ద కిడ్నాప్‌ నకు గురైన బీ- ఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూకీ తెలిసింది. ఆమెను కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు పలు ప్రాంతాల్లో తిప్పిన కిడ్నాపర్ రవిశేఖర్, ఆమెను ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో వదిలేసి పారిపోయాడు.

ఆపై ఆమె తనకు కనిపించిన వారి నుంచి ఫోన్ తీసుకుని, విషయం తల్లిదండ్రులకు తెలిపింది. ఆపై అద్దంకి నుంచి బస్సులో ప్రయాణించి, ఎంజీబీఎస్ చేరగా, రిసీవ్ చేసుకున్న పోలీసులు హయత్ నగర్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆమెను ప్రశ్నించి, వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

కాగా,  ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి, సోనీని, ఆమె తండ్రి, తమ్ముడిని కారు ఎక్కించుకుని, ఆపై కారు నుంచి మాయమాటలతో వారిద్దరినీ దించేసి, సోనీని తీసుకుని శ్రీశైలం వైపుగా వెళ్లిన రవిశేఖర్, చిత్తూరు, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లో తిరిగాడు. పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండటంతో దొరికిపోతానన్న భయంతోనే రవిశేఖర్, సోనీని విడిచిపెట్టినట్టు సమాచారం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News