Ravisekhar: ‘సోనీ’ కిడ్నాపర్ మరో ఘరానా మోసం.. విజిలెన్స్ ఆఫీసర్‌గా వ్యాపారిని బురిడీ కొట్టిన రవిశేఖర్

  • ఈ నెల 23న సోనీని కిడ్నాప్ చేసిన రవిశేఖర్
  • సోమవారం కొండ్రపోలులోని ఎరువుల దుకాణంలో తనిఖీలు
  • లక్ష రూపాయల నగదు, మూడు ఉంగరాలతో పరారీ

హయత్‌నగర్‌లో సోనీ అనే యువతిని కిడ్నాప్ చేసిన రవిశేఖర్ నల్గొండలో ఘరానా మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఒకటి పోలీసులకు చిక్కింది. సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కారులోనే నిందితుడు రవిశేఖర్ నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలులోని ఓ ఎరువుల దుకాణానికి వెళ్లాడు. తనను తాను విజిలెన్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.

సోమవారం ఉదయం 7:55గంటల నుంచి 8:16 గంటల వరకు తనిఖీలు చేపట్టాడు. అనంతరం అతడి నుంచి లక్ష రూపాయల నగదు, మూడు ఉంగరాలు వసూలు చేసి పరారయ్యాడు. అక్కిడి నుంచి అతడు విజయవాడ వైపు వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ నెల 23న హయత్‌నగర్‌లో కిడ్నాప్‌నకు గురైన సోనీ ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Ravisekhar
hayatnagar
sony
Nalgonda District
  • Loading...

More Telugu News