Kanchan Kumari: చావుబతుకుల్లో ఉన్న బాలిక తల్లిదండ్రుల వాదన విని వైద్యులు షాక్!
- అనారోగ్యానికి గురైన కాంచన్
- కిడ్నీ దానం చేయాలని కోరిన వైద్యులు
- ససేమిరా అన్న కుటుంబ సభ్యులు
రెండు కిడ్నీలు పాడై చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతున్న బాలికకు చికిత్సనందిస్తున్న వైద్యులకు ఆమె తల్లిదండ్రులే షాకిచ్చారు. బీహార్‌లోని షేఖ్‌పురా జిల్లా అవ్‌గిల్ గ్రామంలో కాంచన్ కుమారి అనే బాలిక అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. వెంటనే కాంచన్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు అన్ని చికిత్సలు నిర్వహించి రెండు కిడ్నీలు పాడయ్యాయని ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కుటుంబ సభ్యులెవరైనా కిడ్నీ దానం చేసేందుకు ముందుకు రావాలని వైద్యులు సూచించారు.
అయితే కాంచన్ కుటుంబ సభ్యులు మాత్రం దీనికి ససేమిరా అన్నారు. కారణం విని వైద్యులే షాక్ అయ్యారు. ఆడపిల్లకు కిడ్నీ దానం చేయడమేంటంటూ తల్లిదండ్రుల వాదన విన్న డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఈ విషయం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవడంతో అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఇది చూసిన అమెరికాకు చెందిన షార్లే నోర్డిన్, కాంచన్‌కు సాయమందించేందుకు ముందుకు వచ్చారు. తాను కిడ్నీ దానం చేస్తానని ప్రకటించారు.