Virat Kohli: రోహిత్ శర్మతో విభేదాలపై మొదటిసారి స్పందించిన విరాట్ కోహ్లీ

  • రోహిత్ తో విభేదాలు లేవన్న కోహ్లీ
  • లేని వివాదాలు రేకెత్తించవద్దంటూ మీడియాకు హితవు
  • రోహిత్ ఆటకు తాను అభిమానినంటూ వ్యాఖ్య

వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియాలో లుకలుకలు బయటపడ్డాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ముఖ్యంగా, కెప్టెన్ విరాట్ కోహ్లీతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అస్సలు పొసగడం లేదంటూ ప్రచారం మొదలైంది. కోహ్లీ, అనుష్క శర్మలను ఇన్ స్టాగ్రామ్ లో రోహిత్ శర్మ అన్ ఫాలో చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే, రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోహ్లీ స్పష్టం చేశాడు.

వెస్టిండీస్ టూర్ కు బయల్దేరేముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోహిత్ శర్మ కారణంగా తన కెప్టెన్సీకి ఎసరు వస్తుందని తాను ఎప్పుడూ భావించలేదని, ఒకవేళ రోహిత్ ను చూసి అభద్రతా భావానికి లోనైతే అది తన ముఖంలో ప్రతిఫలిస్తుందని వివరించాడు. రోహిత్ శర్మ ఆటకు తాను అభిమానినని కోహ్లీ ఉద్ఘాటించాడు. క్రికెట్ పై దృష్టిపెట్టాల్సిన సమయంలో లేని వివాదాన్ని రేకెత్తిస్తున్నారని, ఈ విషయమై మీడియా ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు.

Virat Kohli
Rohit Sharma
Cricket
India
  • Loading...

More Telugu News