Karnataka: బోర్డులు, కార్పొరేషన్‌ల అధికారాలను ఉపసంహరించిన యడియూరప్ప

  • ఇన్‌చార్జులుగా సెక్రటరీలు పని చేస్తారు
  • ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు చేయాలి
  • మనీ బిల్లులో మాత్రం మార్పు ఉండబోదు

కర్ణాటక ముఖ్యమంత్రిగా బలపరీక్షలో నెగ్గిన యడియూరప్ప వెంటనే వివిధ బోర్డులు, కార్పొరేషన్‌ల అధికారాలను ఉపసంహరిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయా డిపార్ట్‌మెంట్‌లకు ఇన్‌చార్జులుగా సెక్రటరీలు పని చేస్తారని యడియూరప్ప తెలిపారు.

ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు చేయాల్సి ఉందని, అయితే తాజాగా చేపట్టబోయే కార్యక్రమాలన్నీ దానికి అనుగుణంగానే ఉంటాయన్నారు. మనీ బిల్లులో మాత్రం మార్పు ఉండబోదని యడియూరప్ప తెలిపారు. తమ ప్రభుత్వం ప్రతీకారాల జోలికి మాత్రం వెళ్లబోదని ఆయన స్పష్టం చేశారు.

Karnataka
Yadiyurappa
Incharge
Secreteries
Corporation
Money bill
  • Loading...

More Telugu News