West Godavari District: ఏలూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య!

  • ఆస్రం మెడికల్ కళాశాలలో ఘటన
  • ఎంబీబీఎస్ థర్ఢియర్ విద్యార్థి ఆత్మహత్య
  • వసతిగృహంలోని గదిలో ఉరేసుకున్న పుష్పనాయక్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్రం మెడికల్ కళాశాలలోని వైద్య విద్యార్థి పుష్పనాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. వసతి గృహంలోని గదిలో అతను ఉరివేసుకుని చనిపోయాడు. పుష్పనాయక్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడని, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అతని స్వస్థలమని సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

West Godavari District
Medical colleger
suicide
  • Loading...

More Telugu News