Ram: హిట్ కొట్టాలనే కసిని పూరి గారిలో చూశాను: 'గెటప్' శ్రీను

  • పూరి గారి వలన ఛాన్స్ వచ్చింది
  •  ఆయన పట్టుదలను గమనించాను
  •  శంకర్ గా రామ్ అదరగొట్టేశాడు

రామ్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో, 'జబర్దస్త్' గెటప్ శ్రీను ఆటో డ్రైవర్ గా ఒక పాత్రను పోషించాడు. ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతోన్న నేపథ్యంలో ఆయన స్పందించాడు.

"పూరిగారు అవకాశం ఇవ్వడం వలన ఈ సినిమాలో నేను భాగం కాగలిగాను. ఒక మాస్ హిట్ మూవీకి థియేటర్స్ లో ఎలాంటి సందడి ఉంటుందో నాకు తెలుసు .. అలాంటి సందడిని 'ఇస్మార్ట్ శంకర్' థియేటర్స్ లో చూశాను. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పూరిగారి పట్టుదలను షూటింగు సమయంలోనే గమనించాను. అనుకున్నట్టుగానే ఆయన హిట్ కొట్టేశారు. హీరో రామ్ ని అంతా 'ఎనర్జిటిక్  స్టార్' అని ఎందుకు పిలుస్తారనేది ప్రత్యక్షంగా చూశాను. 'శంకర్' పాత్రలో రామ్ అదరగొట్టేశాడు. ఆయన ఎనర్జీకి తగిన ఫలితం వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. 

Ram
Nidhi
Nabha
  • Loading...

More Telugu News