Apollo: ‘అపోలో’ కేన్సర్ కేంద్రాల అంతర్జాతీయ డైరెక్టర్ గా నోరి దత్తాత్రేయుడు నియామకం

  • ‘అపోలో’ కుటుంబంలో కలవడం సంతోషంగా ఉంది
  • కేన్సర్ పై ప్రజల్లో మరింత అవగాహన రావాలి
  • బ్రెస్ట్ కేన్సర్, సర్వైకల్ కేన్సర్ వ్యాధులు ఎక్కువయ్యాయి

అపోలో ఆసుపత్రి కేన్సర్ కేంద్రాల అంతర్జాతీయ డైరెక్టర్ గా ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడుని నియమించారు. ఈ నేపథ్యంలో రెండు నెలలకు ఓసారి భారత్ కు ఆయన రానున్నారు. ఈ సందర్భంగా నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ, ‘అపోలో’ కుటుంబంలో కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని, దేశ ప్రజలకు చికిత్స చేసేందుకు ‘అపోలో’ సరైన వేదికగా తాను భావించానని అన్నారు. దేశంలో కేన్సర్ మహమ్మారి విజృంభిస్తోందని, కేన్సర్ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన రావాలని, ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ తేలికని అన్నారు. బ్రెస్ట్ కేన్సర్, సర్వైకల్ కేన్సర్ వ్యాధులు ఎక్కువయ్యాయని చెప్పారు. 

Apollo
Cancer
International
Director
Nori
  • Loading...

More Telugu News