Budda Venkanna: చంద్రబాబు తిని వదిలేసిన ప్లేట్ల లెక్కలు కాదు, రాష్ట్రం కోసం ఆయన పడ్డ కష్టాన్ని లెక్కించండి: బుద్ధా వెంకన్న

  • ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన బుద్ధా వెంకన్న
  • త్వరలోనే దొంగలెక్కల పాపాలు ప్రక్షాళన అవుతాయంటూ హెచ్చరిక
  • పెద్దల సభలో ఉన్నవాళ్లు పెద్దరికం తెచ్చుకోవాలంటూ హితవు

టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై గళమెత్తారు. ;చంద్రబాబుగారు ఎన్ని బాటిళ్ల నీళ్లు తాగారు? ఆయన తిని వదిలేసిన ప్లేట్లు ఎన్ని? అంటూ లెక్కలు వేయడం మాని, రాష్ట్రం కోసం ఆయన పడిన కష్టాన్ని లెక్కించండి' అంటూ ఘాటైన రీతిలో ఓ ట్వీట్ చేశారు.

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చంద్రబాబు గారు పడిన శ్రమను గుర్తించండి అంటూ వైసీపీ నేతకు హితవు పలికారు. "గతంలో మీ దొంగ లెక్కల పాపాలు త్వరలోనే ప్రక్షాళన అవుతాయి, పెద్దల సభలో వున్నారు, కాస్తంతయినా పెద్దరికం తెచ్చుకోండి" అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల బుద్దా వెంకన్న, వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Budda Venkanna
Chandrababu
YSRCP
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News