KCR: మంత్రిగా, ఎమ్మెల్యేగా ముఖేశ్ గౌడ్ సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్

  • అనారోగ్యంతో కన్నుమూసిన ముఖేశ్ గౌడ్
  • ముఖేశ్ గౌడ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం

మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ముఖేశ్ గౌడ్ చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ముఖేశ్ గౌడ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖేశ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్ గౌడ్ ఈ రోజు అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

KCR
Mukhesh Goud
Telangana
Congress
  • Loading...

More Telugu News