YSRCP: జగన్ గారూ, ఇది నిషేధమా? లేక ‘నిషా’ దమ్మా?: నారా లోకేశ్ సెటైర్లు

  • మద్యపాన నిషేధం అమలు చేస్తారంటే ఏదో అనుకున్నాం!
  • ప్రభుత్వమే మద్యం షాపులు తెరుస్తుందా!
  • గతంలో కంటే మరో రూ.2,297 కోట్ల ఆదాయం గడిస్తారు

వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఏపీలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. మద్యపాన నిషేధం అమలు చేస్తారంటే ఏదో అనుకున్నాం కానీ, ప్రభుత్వమే మద్యం షాపులు తెరుస్తుందని, గతంలో కంటే మరో రూ.2,297 కోట్ల ఆదాయం గడిస్తారని, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బేవరేజెస్ కార్పొరేషన్ రిపోర్ట్ కి వైసీపీ కలర్ వేయిస్తారని అర్థం చేసుకోలేకపోయామని విమర్శించారు. ఇది నిషేధమా లేక ‘నిషా’ దమ్మా? అంటూ సెటైర్లు విసిరారు.

YSRCP
Liquor
prohibition
Nara Lokesh
Telugudesam
  • Loading...

More Telugu News